ఇన్‌సైడర్ ట్రేడింగ్ బూచీ చూపి అమరావతిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని... భాజపా నేత రావెల కిశోర్‌బాబు ఆరోపించారు. మైత్రి సంస్థ పేరిట తాను భూములు కొనుగోలు చేసినట్లు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. తాను భూములు కొన్నట్లు నిరూపించాలని.. లేకుంటే వందకోట్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించకుంటే.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని రావెల హెచ్చరించారు..
'ఆరోపణలు నిరూపించలేకపోతే నష్టపరిహారం ఇవ్వాలి'
వైకాపా నేతలు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని... వారు చెప్పేవన్నీ అబద్ధాలే అని భాజపా నేత రావెల కిశోర్ బాబు పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
రావెల కిశోర్ బాబు
Last Updated : Dec 29, 2019, 2:41 PM IST