ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వాయుగుండంగా బలపడిన అల్పపీడనం - ఆంధ్రాలో వర్షాలు వార్తలు

తూర్పు మ‌ధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్ప‌ పీడ‌నం వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్త‌ర వాయువ్య దిశ‌గా క‌దిలి రేప‌టికి తుపానుగా మారే సూచ‌న‌లు ఉన్నాయ‌ని తెలిపింది.

ఈ రాత్రికి వాయుగుండంగా మారనున్న అల్పపీడనం!
ఈ రాత్రికి వాయుగుండంగా మారనున్న అల్పపీడనం!

By

Published : May 23, 2021, 3:29 PM IST

Updated : May 23, 2021, 5:31 PM IST

వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని.. ఉత్తర వాయవ్య దిశగా కదిలి రేపటికి తుపానుగా మారే సూచనలు ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత 24 గంటల్లో మరింత బలపడి అతి తీవ్ర తుపానుగానూ, అనంతరం ఉత్తర వాయవ్యంగా కదిలి పెను తుపానుగానూ మారే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఈ నెల 26న ఉదయం ఒడిశా - బంగాల్ తీరాన్ని తాకనున్న తుపాను, ఆ రోజు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంటుందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Last Updated : May 23, 2021, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details