లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర - దక్షిణ ద్రోణి, ఆగ్నేయ మధ్యప్రదేశ్ మీదుగా ఉన్న ఆవర్తనం విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా వ్యాపించి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉందన్నారు. ఈ ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు.
వాతావరణం : రాష్ట్రంలో మూడురోజుల పాటు మోస్తరు వర్షాలు - ఆంధ్రప్రదేశ్ వాతావరణఁ
లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడురోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో మూడురోజుల పాటు మోస్తరు వర్షాలు