ఏపీలో ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. తన పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలని.. గతంలో ఫిర్యాదు చేశారన్నారు. మాతృ భాష గురించి మాట్లాడిన తనను అనర్హుడిని చేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. సీఎం జగన్‌కు బెయిల్ రద్దు చేయాలని తాను న్యాయస్థానంలో పిటిషన్ వేయడం.. పార్టీ నిబంధనలకు వ్యతిరేకమని, నియమావళిని ఉల్లంఘించానని చెప్పి మరొకసారి ఫిర్యాదు చేయనున్నారని తెలిపారు.
తనపై అనర్హత వేటు వేసే అవకాశమే లేదని రఘురామ స్పష్టం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.ఆంబేడ్కర్ అందరివాడని.. కొందరి వాడు కాదని చెప్పారు. అవకాశం ఉన్న ప్రతి చోట రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. ఆ మహనీయుడి విగ్రహానికి దండలు వేస్తూ.. దండాలు పెడుతున్నారని.. అయితే, ఆయన రాసిన రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.