బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీపీ సింధు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. సింధుకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆమె కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం వేదపండితులు.. వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈవో భ్రమరాంబ.. సింధుకు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందించారు.
pv sindhu: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న పీవీ సింధు - ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న పీవీ సింధు
ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకుంది. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం సింధుకు ప్రసాదంతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని అందించారు.
pv sindu visits durga temple in vijayawada
టోక్యోకు వెళ్లేముందు అమ్మవారి దర్శనానికి వచ్చానని సింధు అన్నారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు . 2024 పారిస్ ఒలింపిక్స్ లో తప్పకుండా పాల్గొంటానని సింధు తెలిపారు.
ఇదీ చదవండి:ప్రకాశం బ్యారేజికి భారీగా వరద.. కొనసాగుతున్న ప్రమాద హెచ్చరిక
Last Updated : Aug 6, 2021, 11:29 AM IST