ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అరెస్టు నిరసిస్తూ ఏ పీసీసీ ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లో భూవివాదం కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రియాంక గాంధీని అడ్డుకోవడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి అన్నారు. భాజపా నిరంకుశ వైఖరికి ఇదే నిదర్శనమన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసి నీరు, విద్యుత్ నిలిపివేయడం అప్రజాస్వామికమని చెప్పారు. ప్రజలు భాజపాకు బుద్ధి చెప్పేరోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
ప్రియాంక అరెస్టుకు నిరసనగా ధర్నా - tulasi reddy
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.
ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా విజయవాడలో ధర్నా