ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రజాస్వామ్యంలో ఈ తరహా పోకడలు ప్రమాదకరం: ప్రొ. హరిప్రసాద్

ఆర్​ఎస్​ఎస్ ముసుగులో ముస్లింలను ద్వేషించటమే హిందూ మతంలాగా మనదేశంలో అపోహలు సృష్టిస్తున్నారన్నారని ప్రొఫెసర్ హరిప్రసాద్ వ్యాఖ్యనించారు. రాజకీయనేతలు ఓటు బ్యాంకు తయారు చేసుకోవడానికి ఈ తరహా పోకడలకు తెరతీశారన్నారు.

ప్రజాస్వామ్యంలో ఈ తరహా పోకడలు ప్రమాదకరం
ప్రజాస్వామ్యంలో ఈ తరహా పోకడలు ప్రమాదకరం

By

Published : Nov 28, 2020, 10:22 PM IST

విప్లవ కవి కామ్రేడ్ పెద్ది కృష్ణ సంస్మరణ సభ సందర్భంగా ఫాసిజం - ప్రజాస్వామ్య కర్తవ్యాలు అనే అంశంపై విజయవాడ ప్రెస్ క్లబ్​లో సమావేశం నిర్వహించారు. ఎమర్జెన్సీ సమయంలో తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని సొంత పార్టీ అయినా... నిర్బంధించటం నాటి ఫాసిజమయితే... ముస్లిం, మైనారిటీలంతా ఉగ్రవాదులుగా అమెరికా చిత్రీకరించి దోషులుగా నిలబెట్టడం నేటి ఫాసిజమని ప్రొఫెసర్ హరిప్రసాద్ వ్యాఖ్యానించారు.

ఆర్​ఎస్​ఎస్ ముసుగులో ముస్లింలను ద్వేషించటమే హిందూ మతంలాగా మన దేశంలో అపోహలు సృష్టిస్తున్నారన్నారు. సాధారణ హిందువులు మతాన్ని చూడరని... మతం పేరుతో ఓటు బ్యాంకు తయారు చేసుకోవడానికి రాజకీయనేతలు ఈ తరహా పోకడలకు పోతున్నారన్నారు. రైతు వ్యతిరేక బిల్లులు తీసుకురావటం వాటిని వ్యతిరేకిస్తే నిర్బంధించడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా పోకడలు చాలా ప్రమాదకరమైనవి అని వ్యాఖ్యనించారు. ప్రజలంతా ఐక్యమత్యంతో కలిసి ఉండాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details