తొలి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు.. విజయవాడ నగర పాలక సంస్థలో వెలువడ్డాయి. మొదటి విడతగా 23 డివిజన్లలో లెక్కించిన పోస్టల్ బ్యాలెట్లలో.. అధికార వైకాపాకి 143, తెదేపా 45, జనసేనకు 31, భాజపాకు 7 ఓట్లు పోలయ్యాయి.
విజయవాడలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో గందరగోళం నెలకొంది. అభ్యర్థి లేని చోట.. పోస్టల్ బ్యాలెట్ ఓటు పోలైనట్లు అధికారులు ఫలితం విడుదల చేశారు. 29వ డివిజన్లో సీపీఐ నుంచి ఎవరూ పోటీ చేయకపోయినా.. అక్కడ ఆ పార్టీ అభ్యర్థికి ఒక ఓటు పోలైనట్లు చూపించారు. గుర్తేలేని చోట ఓటు ఎలా పోలైందనే చర్చ నడుస్తోంది.