ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో "అక్రమ రవాణా అడ్డుకుందాం- ఆడపిల్లలను కాపాడుకుందాం" అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏడీఎస్పీ శ్రీనివాస్ రావు హాజరయ్యారు. మానవ అక్రమ రవాణ ఆధునిక కాలపు బానిసత్వంగా పరిగణించాలని వక్తలు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అక్రమ రవాణాకు గురైన మహిళలను గుర్తించి పునరావాసం కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట చట్టం తీసుకురావాలని కోరారు.
'అక్రమ రవాణాను అడ్డుకుందాం- ఆడపిల్లలను కాపాడుకుందాం'
విజయవాడ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు.
'అక్రమ రవాణా అడ్డుకుందాం-ఆడపిల్లలను కాపాడుకుందాం'