PRC Sadhana Samithi Leaders Meet Vijayawada CP: విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటాతో పీఆర్సీ సాధన సమితి నేతలు భేటీ అయ్యారు. భేటీ అనంతరం చలో విజయవాడ రేపు యథావిధిగా జరుగుతుందని సాధన సమితి నేతలు ప్రకటించారు. సీపీ ఆహ్వానం మేరకు చర్చలకు వెళ్లిన నేతలు.. చలో విజయవాడ కార్యక్రమంపై అనుమతి నిరాకరణ, ఇతర అంశాలపై సీపీతో చర్చించారు.
చలో విజయవాడపై పీఆర్సీ సాధన సమితి ప్రకటనతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారు. వివిధ జిల్లాల్లోని ఉద్యోగ సంఘాల నేతలను గృహనిర్బంధం చేసి.. కార్యక్రమానికి వెళ్లొదని నోటీసులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు.. విజయవాడకు వెళ్లే అన్ని మార్గాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి బస్సులు, కార్లు, ఇతర వాహనాలను తనిఖీ చేస్తున్నారు.