దిల్లీ నుంచి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC), రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ (REC) ప్రతినిధుల బృందం రాష్ట్రానికి చేరుకుంది. ప్రత్యేక విమానంలో ఐదుగురు ప్రతినిధులతో కూడిన బృందం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. ప్రతినిధుల బృందంలో మినిస్ట్రీస్ పవర్ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా, పీఎఫ్సీ ఛైర్మన్, ఆర్.ఎస్ దిళ్లనీలతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. జెన్కోకు ఇచ్చిన రుణ బకాయిలపై సీఎస్‌తో (CS) ప్రతినిధులు చర్చించనున్నారు.
ఆర్ఈసీకి ఏపీ జెన్కో (APGENCO) మెుత్తం రూ.11,157 కోట్ల మేర బకాయి పడగా..,అక్టోబరు 31 నాటికి రూ.405 కోట్లు బకాయి పడింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.141 కోట్లు బకాయి పడింది. 90 రోజుల గడువు దాటడంతో జెన్కోను ఎన్పీఏగా ఆర్ఈసీ ప్రకటించింది. ఇన్‌సాల్వన్సీ అండ్ బ్యాంకరప్ట్సీ కోడ్ వినియోగంపై ప్రతినిధులు బుధవారం సీఎస్‌తో చర్చించే అవకాశం ఉంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.2 వేల కోట్ల మేర బకాయి పడగా..తక్షణం చెల్లించకుంటే డిఫాల్టర్‌గా ప్రకటిస్తామని పీఎఫ్సీ గతంలోనే తేల్చి చెప్పింది. ఈ మేరకు సెటిల్మెంట్ కోసం పీఎఫ్సీ, ఆర్ఈసీ ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చారు.
అప్పు వసూలు చేసుకోవటానికే వచ్చారు: పయ్యావుల