Power employees JAC meeting: సమస్యలు పరిష్కరించాలని కోరితే.. కేసులు, విచారణలు, ఎఫ్‌ఐఆర్‌ల పేరితో తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐకాస నేతలు ఆవేదన చెందారు. ఇంధనశాఖ మంత్రి సమక్షంలో.. యాజమాన్యం అంగీకరించిన సమస్యల అమలు కోసం.. 31 సంఘాలతో ఏర్పడిన ఐకాస విజ్ఞప్తి చేశామన్నారు.
విజయవాడలో నిర్వహించిన ఐకాస సమావేశంలో.. తాజా పరిణామాలపై వారు చర్చించారు. ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త సేవా నిబంధనలను డిస్కమ్‌లో రూపొందించడాన్ని విరమించుకోవాలని.. ఉద్యోగుల తొలగింపు చర్యలు విడనాడాలని విజ్ఞప్తి చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను తక్షణమే విడుదల చేస్తామని.. విద్యుత్ శాఖ మంత్రి ఈ ఏడాది జూన్ 14న ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. ఏపీపీడీసీఎల్, ఏపీ జెన్కోకు చెందిన ఎస్డీఎస్టీపీఎస్(SDSTPS) ప్రాజెక్టు ప్రైవేటీకరణ, సేల్‌అవుట్‌తో పాటు హైడల్ ప్రాజెక్టులను అప్పగించడం వంటివి.. ఉపసంహరించుకోవాలని కోరారు.