ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్లోని వనస్థలిపురం, హస్తినాపురం, లింగోజిగూడ, చంపాపేటలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో విద్యుత్ శాఖకు ప్రజలు ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆ నంబర్లు పనిచేయక వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మల్లాపూర్ భవానీనగర్ నాలాలో పడిన బాలికను జీహెచ్ఎంసీ సిబ్బంది రక్షించారు. చిన్న చర్లపల్లి నుంచి పారిశ్రామికవాడ రహదారిపై చెట్టు, సైదాబాద్ పూసల బస్తీ కమాన్ వద్ద ఓ ఇంటి గోడ, బ్రహ్మపురి కాలనీలోని గుల్మోర్ అపార్ట్మెంట్లో గోడ కూలింది. అలాగే కాప్రా చెరువు నాలా ప్రవాహంతో అపార్ట్మెంట్ ప్రహరీ గోడ కూలింది.