ప్రజా రక్షణకై పోలీసులు చేస్తున్న సేవలను వివరించే గోడ ప్రతులను డీజీపీ గౌతమ్ సవాంగ్ విజయవాడలో విడుదల చేశారు. శౌర్య, స్మృతి పేర్లతో ద్రోణ కన్సల్టెన్సీ ప్రతినిధి సురేష్... ఈ గోడప్రతులను రూపొందించారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వీటిని విడుదల చేసినట్లు సవాంగ్ తెలిపారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ దేశ రక్షణ ధ్యేయంగా పనిచేస్తారంటూ ... రక్షకభటుల సేవలను కొనియాడారు . శాంతి భద్రతలకు విఘాతం కలిగినపుడు , ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు పోలీసులు కీలకంగా పనిచేస్తారని డీజీపీ సవాంగ్ అన్నారు.
పోలీసుల సేవలు ఎనలేనివి: డీజీపీ సవాంగ్ - police wallposter released by dgp goutham sawang in vijayawada
ప్రజా వ్యవస్థలో పోలీసుల సేవలను వివరిస్తూ రూపొందించిన గోడ ప్రతులను డీజీపీ సవాంగ్ విడుదల చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల కృషి మరువలేనిదని డీజీపీ కొనియాడారు.
పోలీసుల సేవలను వివరిస్తూ గోడప్రతులు విడుదల
TAGGED:
dgp goutham sawang