ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 22, 2020, 7:52 PM IST

ETV Bharat / city

దుర్గ గుడి రథం సింహాల కేసు...అనుమానితుల విచారణ

దుర్గగుడి ఆలయ రథం సింహం ప్రతిమల అదృశ్యం కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. కొండపై జరుగుతున్న విస్తరణ పనుల్లో పాల్గొన్న కూలీలు, మేస్త్రీలతో ఆలయ సిబ్బందిని విచారిస్తున్నారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

దుర్గగుడి ప్రతిమల కేసు
దుర్గగుడి ప్రతిమల కేసు

రాష్ట్రంలో సంచలనం రేపిన దుర్గగుడి రథం సింహం ప్రతిమల అదృశ్యంపై పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఈ ఘటనకు సంబంధించిన అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొండపై ఉన్న శివాలయంలో గత కొన్ని నెలలుగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. బిహార్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన కూలీలు విస్తరణ పనుల్లో పాల్గొన్నారు. లాక్​డౌన్ కారణంగా కొంతమంది ఇంటికి వెళ్లిపోయారు.

రథంపై సింహం ప్రతిమ ఉండే ప్రదేశం

విజయవాడ పోలీసులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి శివాలయ విస్తరణ పనుల్లో పాల్గొన్న కూలీలను అదుపులోకి తీసుకున్నారు. పనులు కాంట్రాక్ట్ తీసుకున్న మేస్త్రీలను, కూలీలను విజయవాడలో విచారిస్తున్నారు. వీరితోపాటు ఆలయ సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. మరోవైపు ఆలయాల్లో దొంగతనాలు చేసే ముఠాలపై ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

చోరీ యత్నంలో ధ్వంసమైన సింహం ప్రతిమ

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details