పోలవరం(POLAVARAM) ప్రాజెక్టులో నిర్వాసితులకు అదనపు ఆర్థికసాయం(ADD. FINANCIAL PACKAGE) అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద రూ. 550 కోట్లను కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
నిర్వాసితులకు పరిహారంతో పాటు అదనపు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనుంది. 41.15 కాంటూరు కంటే దిగువన ఉన్న నిర్వాసితులకు ఈ అదనపు ప్యాకేజీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.