ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్​: సికింద్రాబాద్​ రైల్వే ప్లాట్​ఫామ్​ టికెట్​ ధర పెంపు - coronavirus in india

ప్రయాణికులతో పాటు వచ్చే వారి రద్దీని నియంత్రించేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో ప్లాట్ ఫాం టికెట్ ధరను రూ.50కు పెంచాలని అధికారులు నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ధర పెంచితే ప్రయాణికులతో పాటు వచ్చే వారి సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నారు.

platform tickets rate increases to 50 rupees
కరోనా ఎఫెక్ట్​: ఫ్లాట్​ఫామ్​ టికెట్​ ధర పెంపు

By

Published : Mar 17, 2020, 6:07 PM IST

కరోనా ఎఫెక్ట్​: సికింద్రాబాద్​ రైల్వే ప్లాట్​ఫామ్​ టికెట్​ ధర పెంపు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​కు నిత్యం 1.80 లక్షల నుంచి 2 లక్షల మంది ప్రయాణికులు వస్తుంటారు. వీరికి వీడ్కోలు పలికేందుకు మరో 50 వేల మంది వరకు వస్తుంటారని దక్షిణ మధ్య రైల్వే రైల్వేశాఖ లెక్కలు వేసింది. ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో కరోనా వైరస్ సునాయసంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడం వల్ల ప్లాట్ ఫాం టికెట్​ ధర పెంచాలని అధికారులు నిర్ణయించారు.

ప్రస్తుతం ప్లాట్ ఫాం టికెట్ ధర 10 రూపాయలుగా ఉంది. రూ.50కు పెంచితే వీడ్కోలు పలికేందుకు వచ్చే వారిని నిరోధించే అవకాశముంటుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్​ఫామ్​ టికెట్ ధర పెంచితే.. కాచిగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో కూడా పెంచే అవకాశాలున్నాయి.

ఇదీ చూడండి:

'కరోనా' సెలవుల్లో.. పిల్లలతో ఇలా చేయించండి!

ABOUT THE AUTHOR

...view details