ఉల్లి ధర రాకెట్ స్పీడుతో దూసుకుపోతోంది. రూ.50 నుంచి రూ.100కు చేరింది. బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయలు కొనాలంటే ప్రజలు వణికిపోతున్నారు. కొంత ఉపశమనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. రాయితీపై కేజీ రూ.25కే విక్రయిస్తోంది. ధర తక్కువే అయినా ఉల్లిని పొందాలంటే మాత్రం 'క్యూ' కష్టాలు తప్పట్లేదని ప్రజలు వాపోతున్నారు. ఉదయం నుంచే రైతు బజార్లలో వరుసలో నిలబడుతున్నారు. పనులు మానుకొని మరీ క్యూలో నిరీక్షిస్తున్నారు. ఇంత చేసినా వారికి దక్కేది కేజీ మాత్రమే. ప్రభుత్వం స్పందించి... ఒక్కొక్కరికి 3 కేజీల వరకూ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
ఉదయం నుంచే బారులు... అయినా ఇచ్చేది కేజీనే..!
ఉల్లి ధర కొండెక్కి కూర్చుంది. ఫలితంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేజీ ఉల్లిపాయల కోసం గంటల తరబడి క్యూలో వేచిచూస్తున్నారు. మహిళలు, వృద్ధులు క్యూలో అవస్థలు పడుతున్నారు.
onion