జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చాతుర్మాస్య దీక్ష చేపట్టారు. ప్రజల క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆర్ధిక శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ దీక్ష చేపట్టినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. తొలి ఏకాదశి పుణ్య దినాన ఈ దీక్షకు శ్రీకారం చుట్టారు. శాస్త్ర ప్రకారం ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు దీక్ష ప్రారంభించి... కార్తీక శుక్ల ఏకాదశి రోజు పూర్ణాహుతితో దీక్ష ముగిస్తారు. నాలుగు మాసాలపాటు ఈ దీక్ష కొనసాగుతుంది.
చాతుర్మాస్య దీక్షలో జనసేన అధినేత
ప్రజల క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆర్ధిక శ్రేయస్సును కాంక్షిస్తూ...జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాతుర్మాస్య దీక్ష చేపట్టారు. నాలుగు నెలలపాటు ఈ దీక్ష కొనసాగుతోంది.
దాదాపు రెండు దశాబ్దాల నుంచి పవన్ కళ్యాణ్ ఈ దీక్షను ఆచరిస్తున్నారు. దీక్షా కాలంలో పూజా కార్యక్రమాలతో పాటు అనుష్టానాన్నిఅర్పించి... ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తారు. అది కూడా సాత్వికాహారం మాత్రమే తీసుకుంటారు. కరోనా పట్టి పీడిస్తున్నతరుణంలో ప్రజలు ఆర్ధికంగా, మానసికంగా నలిగిపోతున్నారని... కుల వృత్తులను నమ్ముకుని జీవిస్తున్నవారు, వివిధ రంగాల్లోని ప్రైవేట్ ఉద్యోగులు, రోజువారి కూలీలు, చిరు వ్యాపారులు చాలా మంది ఉపాధి కోల్పోయి అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్భర పరిస్థితుల నుంచి వారందరినీ బయటపడేసి... అందరూ సాధారణ జీవనం గడిపేలా చేయాలని... ఆ భగవంతుడిని కోరుతూ ఈసారి దీక్ష చేపట్టినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
ఇవీ చదవండి:ఆశలు రేపుతున్న కరోనా వ్యాక్సిన్.. అతి త్వరలో రాబోతోంది..