తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. పరువు కోసం కన్న కూతురునే తల్లిదండ్రులు కడతేర్చారు. మానవపాడు మండలం కలుకుంట్లలో భాస్కర్ శెట్టి వీరమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో మూడో కుమార్తె దివ్య (20) ఏపీ కర్నూల్ జిల్లాలోని ప్రైవేటు కళశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటోంది.
అయితే రెండు నెలలు నెలసరి రాకపోవడం వల్ల తల్లిదండ్రులు అనుమానంతో ఆస్పత్రిలో చూపించారు. వైద్యుడు పరిశీలించి గర్భవతి అని నిర్ధరించాడు. ఇంటికివచ్చిన తర్వాత తల్లిదండ్రులు యవతిని నిలదీశారు. కర్నూల్ జిల్లాకు చెందిన అబ్బాయిని ప్రేమించినట్లు తెలిపింది. అయితే అమ్మాయిని అబార్షన్ చేసుకోమని తల్లిదండ్రులు ఒత్తిడి చేయగా దివ్య ఒప్పుకోలేదు.