ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ముగిసిన పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్లు - ఏపీ పంచాయతీ ఎన్నికలు 2020 వార్తలు

panchayath elections nomination end
panchayath elections nomination end

By

Published : Jan 31, 2021, 5:00 PM IST

Updated : Jan 31, 2021, 5:42 PM IST

16:38 January 31

రాష్ట్రంలో తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 29 ఉదయం 10.30గంటల నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. 3 రోజుల పాటు కొనసాగిన ఈ ప్రక్రియ ఇవాళ సాయంత్రం 5 గంటలకు పూర్తైంది. విజయనగరం జిల్లా మినహా 12 జిల్లాలో 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలో 168 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 29న తొలిరోజున పంచాయతీల్లో 1315, వార్డుల్లో 2200 నామినేషన్లు దాఖలు కాగా.. ఈ నెల 30న 7460 పంచాయతీల్లో, 23,318 వార్డుల్లో నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజుల్లో కలిపి పంచాయతీల్లో 8773 , వార్డుల్లో 25 వేల 519 నామినేషన్లు దాఖలయ్యాయి. 

ఇవాళ ఆఖరి రోజు కావడంతో అన్నిచోట్లా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. పోలీసు బలగాలను మొహరించినా.. కొన్నిచోట్ల అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. చిన్నపాటి ఘర్షణలు, దాడులు, అపహరణలు, నామ పత్రాలు లాక్కెళ్లడం, బెదిరింపులు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ కారణాలతో కొంత మంది అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. ఇవాళ దాఖలైన నామ పత్రాల వివరాలను కలెక్టర్లు క్రోడీకరిస్తున్నారు. మరికొద్దిసేపట్లో వీటి పూర్తి వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలియజేయనుంది. రేపు అన్నిచోట్ల నామినేషన్లను అధికారులు పరిశీలన చేయనున్నారు. ఎల్లుండి అంటే ఫిబ్రవరి 2న తిరస్కరించిన నామినేషన్లను సంబంధిత రెవెన్యూ డివిజన్ల అధికారి వద్ద అప్పీలు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 3న అప్పిలేట్ అధికారి ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. పిబ్రవరి 4న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది.

ఎవరైనా అభ్యర్థులు పోటీనుంచి నిష్క్రమించాలనుకుంటే వారి నామినేషన్ పత్రాలను ఆ సమయంలోపు వెనక్కి తీసుకోవచ్చు. అదే రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రచురిస్తారు. పిబ్రవరి 9న ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలివిడతలో 3,249 పంచాయితీలకు, 32,504 వార్డులకు ఎన్నికలు జరగుతాయి. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఫలితాలు వెల్లడి ముగిశాక ఉప సర్పంచి ఎన్నిక చేపడతారు.

ఇదీ చదవండి:ఇంతకీ ఎన్నికల కోడ్ అంటే ఏంటి? మెుదట ఎక్కడ అమలైంది?

Last Updated : Jan 31, 2021, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details