రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్ అమలు కోసం గ్రామ వార్డు సచివాలయాలకు రిజిస్ట్రేషన్ అధికారాలు దాఖలు పరుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామ వార్డు సచివాలయాల్లోని పంచాయితీ సెక్రటరీలు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు సబ్ రిజిస్ట్రార్ల అధికారాలను దఖలు పరుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఒన్ టైమ్ సెటిల్మెంటు స్కీమ్ లోని పత్రాలను రిజిస్ట్రేషన్ చేసేందుకు గానూ తాత్కాలికంగా ఈ అధికారాలను దఖలు పరుస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ నోటిఫికేషన్ జారీ చేశారు. గృహనిర్మాణ శాఖ చేపట్టిన ఈ ఒన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ అమలు కోసం డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు గ్రామ వార్డు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు కూడా సహకరించాలని సూచనలు జారీ చేసింది. తక్షణం ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.