ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సిక్మా ఔదార్యం: సీఎం సహాయ నిధికి 200 ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లు అందజేత - సౌత్‌ ఇండియన్‌ సిమెంట్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఆక్సిజన్ కాన్సట్రేటర్లు పంపిణీ

కొవిడ్ వేళ సౌత్‌ ఇండియన్‌ సిమెంట్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఔదార్యాన్ని చాటింది. సీఎం సహాయనిధికి 200 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లను అందించింది. రూ.2కోట్ల విలువైన కాన్సన్​ట్రేటర్లను సిక్మా ప్రతినిధులు క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి అందజేశారు.

oxyzen concebtraters to cm relief fund
oxyzen concebtraters to cm relief fund

By

Published : Jun 15, 2021, 9:44 PM IST

Updated : Jun 16, 2021, 3:06 PM IST

కొవిడ్‌ నివారణ, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. సౌత్‌ ఇండియన్‌ సిమెంట్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌(సిక్మా) ప్రతినిధులు రూ.2 కోట్లు విలువైన 200 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేర్లను సీఎం సహాయనిధికి అందజేశారు. ఒక్కొక్కటి 10 లీటర్ల కెపాసిటీ ఉన్న 200 కాన్సన్‌ట్రేటర్లను విరాళంగా ఇచ్చారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని కలిసిన భారతీ సిమెంట్స్‌ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్‌ రెడ్డి, సాగర్‌ సిమెంట్స్‌ ఎండీ డాక్టర్‌ ఎస్‌.ఆనంద్‌ రెడ్డి , సిక్మా సీఈవో ఇంజేటి గోపినాథ్​ వాటిని అందజేశారు.

Last Updated : Jun 16, 2021, 3:06 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details