Online classes in schools: తెలంగాణలోని ఉన్నత తరగతుల విద్యార్థులకు ఈ నెల 24వ తేదీ నుంచి ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా బోధన నిర్వహించాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఈ నెల 30వరకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో.. ఎనిమిది, తొమ్మిది, పదో తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్, దూర విద్య ద్వారానే బోధన నిర్వహించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.
పాఠశాలలకు హాజరయ్యే ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది సైతం రొటేషనల్ బేసిస్లో 50 శాతం మాత్రమే హాజరు కావాలని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలన్ని అమలయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.