కృష్ణా నదిలో దూకి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన కృష్ణాజిల్లా తాడిగడపలో జరిగింది. గ్రామానికి చెందిన మన్నే దుర్గా ప్రసాద్...కృష్ణా నదిలో పూజ చేసుకుంటానని చెప్పి తన తమ్ముడు కుమారుడు సుజిత్ వాహనంపై నది వద్దకు చేరుకున్నాడు. నదికి పూజ చేసే దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించాలని సుజిత్‌కు సూచించాడు. సుజిత్ సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా...నదిలో హఠాత్తుగా దూకేశాడు. అనారోగ్యం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వృద్ధుడు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ చేపట్టారు.
భార్యను నదిలో తోసి...తానూ దూకేశాడు
హైదరాబాదులోని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్ అనే వ్యక్తి తన భార్యను నదిలో తోసి తాను కూడా దూకేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా కోవెలకుంట్ల సమీపంలో జరిగింది. నదిలో దూకిన వెంటనే భాస్కర్ ఒడ్డుకు చేరుకోగా...అర కిలోమీటర్ కొట్టుకుపోయిన అతని భార్య రామలక్ష్మిని స్థానికులు కాపాడారు. తన భర్త భాస్కర్ తనను చంపాలనుకున్నాడని ఆరోపిస్తూ...రామలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సరదగా ఈతకు వెళ్లి
సరదగా ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం సూరాయపాళెంలో జరిగింది. గ్రామానికి చెందిన ఎన్. వినోద్ కుమార్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థి ఈత కొట్టేందుకు చెరువులోకి దిగి మృతి చెందాడు.