కొవిడ్ నుంచి ప్రజలను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు తాము చేస్తున్నామని కృష్ణా జిల్లా మైలవరం ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం కొవిడ్ టీకాలు నిల్వలు లేవని ఓ బోర్డును ఏర్పాటు చేశారు. టీకా తీసుకోవడం కోసం ఆసుపత్రికి వచ్చేవారికి ఇది నిరాశను మిగులుస్తోంది.
ఆసుపత్రిలో కేవలం అత్యవసర కేసులను మాత్రమే చూస్తున్నట్లు తెలిపారు. గర్భిణులకు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి వారంలో మూడు రోజులు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వైరస్ భారిన పడ్డ వారు వత్తిడికి లోనవకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచిస్తున్నారు. విపత్కర పరిస్థితిలో వాక్సిన్ నిరంతరం అందుబాటులో ఉండే విధంగా అధికారులు, నాయకులు చొరవతీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.