ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NITI Aayog team visit to krishna district: రేపు కృష్ణా జిల్లాకు నీతి ఆయోగ్ సభ్యుల బృందం రాక..

NITI Aayog team: నీతి ఆయోగ్ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్వరరావు ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల బృందం.. బుధవారం కృష్ణా జిల్లాకు చేరుకోనుంది. ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించేందుకు.. వారు జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు.

By

Published : Nov 30, 2021, 10:44 PM IST

NITI Aayog team visit to krishna district
రేపు కృష్ణా జిల్లాకు నీతీ ఆయోగ్ సభ్యుల బృందం రాక.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

NITI Aayog team visit to krishna district: కృష్ణా జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించేందుకు.. ఏడుగురు నీతి ఆయోగ్ సభ్యుల బృందం బుధవారం జిల్లాకు చేరుకోనుంది. నీతీ ఆయోగ్ బృందం రెండు రోజులు జిల్లాలో పర్యటించనుండగా.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నివాస్ పరిశీలించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్లు డా.కె.మాధవీలత, ఎల్. శివశంకర్, సహా వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

నీతి ఆయోగ్ బృందం బుధవారం ఉదయం దిల్లీ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు.. నీతి ఆయోగ్ బృందం గన్నవరం మండలం వీరపనేనిగూడెం చేరుకొని తెల్లం విజయ్ కుమార్ అనే రైతుతో సమావేశమవుతారు. రైతుతో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన అంశాలను చర్చించనున్నారు. అనంతరం వీరపనేనిగూడెంలో.. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి విజయవాడ చేరుకుని.. మధ్యాహ్నం ముఖ్యమంత్రి, వివిధ శాఖల రాష్ట్ర స్థాయి అధికారులను కలవనున్నారు. సాయంత్రం 04:30 గంటలకు వివిధ పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామిక సంఘాలతో సమావేశం కానున్నారు. అనంతరం 05:30 గంటలకు వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్‌లర్లు, విద్యా సంస్థల ప్రతినిధులు, సామజిక సంఘాల ప్రతినిధులతో భేటీ అవనున్నారు. డిసెంబర్ 2వ తేదీ ఉదయం గన్నవరం నుంచి విమానంలో దిల్లీ బయలుదేరి వెళతారు. -నివాస్, కృష్ణా జిల్లా కలెక్టర్

ఇదీ చదవండి:MP Vijaya sai On Floods: వరదలతో నష్టపోయాం..తక్షణమే వెయ్యి కోట్లు ఇవ్వండి: విజయసాయి

ABOUT THE AUTHOR

...view details