ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కోటి ఆశలతో కొత్త ఏడాదికి శుభ స్వాగతం

రాష్ట్రవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు మిన్నంటాయి. పాత సంవత్సరంతో పాటు చేదు జ్ఞాపకాలకు వీడ్కోలు పలికిన ప్రజలు.... సరికొత్త ఉత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతంపలికారు. కుర్రకారు కేకులు కట్‌చేసి కోలాహలాల నడుమ వేడుకలు చేసుకున్నారు. తమదైన ఆటపాటలతో ఆనందోత్సాహాల్లో మునిగితేలారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/01-January-2020/5555577__vzm.mp4
ఆనందోత్సవాలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికిన రాష్ట్ర ప్రజలు

By

Published : Jan 1, 2020, 6:40 AM IST

Updated : Jan 1, 2020, 7:21 AM IST

రాష్ట్రంలో కొత్త సంవత్సర వేడుకలు కోలాహల వాతావరణంలో సాగాయి. చిన్నాపెద్దా అంతా కలిసి సందడిగా గడిపారు.

తిరుపతిలో నూతన సంవత్సర సంబరాలు

రాష్ట్ర ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో నూతన సంవత్సర సంబరాలు అంభరాన్నంటాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా నగరవాసులంతా కొత్త ఏడాదికి శుభ స్వాగతం పలికారు. ఆటపాటలతో, ఉత్సాహపరిచే నృత్యాలతో 2019 సంవత్సరానికి ఘన వీడ్కోలు పలికి... 2020కి అదిరే ఆరంభం ఇచ్చారు. సరికొత్త దశాబ్దానికి ఉరిమే ఉత్సాహంతో స్వాగతం పలుకుతూ సంబరాలు చేసుకున్నారు.

శ్రీకాకుళంలో నుతన సంవత్సర సంబరాల్లో వైకాపా నాయకులు

శ్రీకాకుళం విజేత హోటల్‌లో నూతన సంవత్సర వేడుకలను వైకాపా నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు.

విజయవాడలో హుషారుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

కొత్త ఏడాదిని పురస్కరించుకుని విజయవాడలోని ప్రముఖ హోటళ్లన్నీ సుందరంగా ముస్తాబు అయ్యాయి. నోవాటెల్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు ఆహూతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో యువత సంబరాల్లో పాల్గొని సంగీత, నృత్యప్రదర్శనలను ఆస్వాదించారు. మరోవైపు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లేవారితో నగరంలోని ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిశాయి. నగర పోలీసులు పోలీస్‌స్టేషన్లలో కేక్‌ కట్‌ చేసి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు.

విజయనగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
విజయనగరం జిల్లాలో నూతన సంవత్సరం పురస్కరించుకుని.... కాలనీలో పెద్దలను గౌరవించే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారు. పార్వతీపురంలో వాడవాడలు యువత కేరింతలతో మారుమ్రోగాయి. చిన్నారులు మహిళలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలపించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షించారు.
సాగర తీరంలో నూతన సంవత్సర వేడుకలు

విశాఖ సాగర తీరంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. కాళీ మాత ఆలయం నుంచి యంఎంసీఏ వరకు రోడ్డంతా జనాలతో కిక్కిరిసి పోయింది. ఆర్కే బీచ్లో ఇసుక వేస్తే రాలనంతగా ప్రజలు వచ్చారు. బీచ్​లో ఈలలు వేస్తూ.. కాల్చిన బాణసంచా చూపరులను ఆకట్టుకుంది.

గుంటూరులో ఆటపాటల నడుమ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

గుంటూరులో నూతన సంవత్సర వేడుకలు కోలాహలంగా జరిగాయి. యువత కేరింతలు కొడుతూ ఆనందోత్సవాల మధ్య కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. కళాశాల యువత నృత్య...గాన పదర్శనలతో ఉత్సహాన్ని ప్రదర్శించారు. యువకులు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి వాహనాలపై తిరుగుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కళాశాల యువత నూతన సంవత్సరం సందర్భంగా తమ రాజధానిని మార్చకూడదని నినదించారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ తమ ఆంకాక్షను వెలిబుచ్చారు.

అనంతలో నూతన సంవత్సర వేడుకలు

అనంతలో న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదట జిల్లా పోలీసులు డీఎస్పీ వీర రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా పోలీసు బలగాలతో చర్యలు తీసుకున్నారు. నగరంలోని టవర్ క్లాక్ వద్ద పోలీసుల ఆధ్వర్యంలో డీఎస్పీ కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపారు.

ఇదీ చూడండి: అంధ్రా కశ్మీర్ చూడాలంటే...చలో లంబసింగి

Last Updated : Jan 1, 2020, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details