ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆన్​లైన్​ మోసాలకు అడ్డుకట్ట వేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రంలో ఆన్​లైన్​లో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై రవాణాశాఖ ఉక్కుపాదం మోపుతోంది. అక్రమాలకు పాల్పడిన వాహన విక్రయ డీలర్లపై 200 శాతం వరకు రవాణాశాఖ జరిమానా విధిస్తోంది. అక్రమాల నివారణకోసం రవాణాశాఖ సర్వర్​లో కీలక మార్పులు చేస్తోందని రవాణాశాఖ కమిషనర్ పి.సీతా రామాంజనేయులు తెలిపారు.

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామన్న రవాణాశాఖ కమిషనర్

By

Published : Aug 14, 2019, 2:26 PM IST

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామన్న రవాణాశాఖ కమిషనర్

ఆన్​లైన్​లో అక్రమాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ఆటలు కట్టేందుకు సిద్ధమైంది రాష్ట్ర రవాణా శాఖ. రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు చేసిన తనీఖీల్లో వాహన విక్రయ డీలర్ల బాగోతాలు వెలుగుచూశాయి. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో వాహనం రేటును తక్కువగా చూపించి ప్రభుత్వానికి పన్ను ఎగవేస్తోన్న వారిపై దాడులు కొనసాగుతున్నాయని రవాణాశాఖ కమిషనర్ పి.సీతా రామాంజనేయులు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వాహన విక్రయ డీలర్లపై ఏకంగా 200 శాతం వరకు జరిమానా విధించా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామని ఆయన వివరించారు. మరోవైపు రాష్ట్రంలో రహదారి ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా... రోడ్డు భద్రత కోసం ప్రభుత్వం 50 కోట్లు కేటాయించిందని కమీషనర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details