ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నూతన గవర్నర్ బిశ్వభూషణ్ రాజకీయ ప్రస్థానమిది

నవ్యాంధ్ర నూతన గవర్నర్ బిశ్వభూషణ్​కు భాజపాతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. రాజకుటుంబానికి చెందిన ఆయన జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ నుంచి రాష్ట్ర మంత్రి వరకు ఎన్నో పదవులు అలంకరించారు. అంతేకాదు ఆయన రచయిత కూడా.

జగన్​తో గవర్నర్

By

Published : Jul 24, 2019, 11:36 AM IST

నవ్యాంధ్రప్రదేశ్ నూతన గవర్నర్​గా బాధ్యతలు స్వీకరించబోతున్న బిశ్వభూషణ్ హరిచందన్.. ఒడిశా రాజకీయాల్లో కీలక నేత. బాన్‌పూర్ రాజ కుటుంబానికి చెందిన ఆయన.. ఆగస్టు3, 1934లో జన్మించారు. ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పట్టా పొందిన అనంతరం పీజీ పూర్తి చేశారు. 1971లో భారతీయ జనసంఘ్‌లో చేరి... 1980లో జనతా పార్టీ ఆవిర్భవించాక ఆ పార్టీ ఒడిశా అధ్యక్షునిగా, జాతీయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా సేవలందించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన సమయంలో మీసా చట్టం కింద అరెస్టయ్యారు. 1990వ సంవత్సరంలో బిజూ పట్నాయక్ మంత్రివర్గంలో ఆహారం, పౌర సంబంధాల శాఖను నిర్వహించారు. 1996లో భువనేశ్వర్ నుంచి ఉపఎన్నికల్లో విజయం సాధించారు. భాజపా శాసనసభా పక్ష నాయకునిగా వ్యవహరించారు. 2000వ సంవత్సరంలో ఆదే నియోజకవర్గం నుంచి 97వేల 539 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అనంతరం భాజపా, బీజేడీ ఉమ్మడి ప్రభుత్వంలో రెవెన్యూ, న్యాయశాఖలను అధిరోహించారు. హరిచందన్‌ రచయిత కూడా. శేష ఝలక్‌, అస్తాశిఖా, రాణాప్రతాప్‌, మానసి, మారు బతాస్‌ తదితర పుస్తకాలు రచించారు.

ABOUT THE AUTHOR

...view details