ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP Corona cases: రాష్ట్రంలో కొత్తగా 1,345 కరోనా కేసులు, 4 మరణాలు - ఏపీ కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 1,345 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 1,345 కరోనా కేసులు

By

Published : Feb 10, 2022, 5:46 PM IST

Updated : Feb 10, 2022, 5:56 PM IST

17:44 February 10

రాష్ట్రంలో కొత్తగా 1,345 కరోనా కేసులు

ఏపీ కరోనా బులిటెన్

AP CORONA CASES:రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 26,393 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా..1,345 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 6,576 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 40,884 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. వైరస్ కారణంగా కొత్తగా మరో నలుగురు మరణించినట్లు పేర్కొంది.

దేశంలో కరోనా తగ్గుముఖం..

దేశంలో కరోనా గణనీయంగా తగ్గుముఖం పడుతోందని కేంద్రం వెల్లడించింది. ఇదివరకుతో పోలిస్తే పరిస్థితి మెరుగైందని.. ప్రపంచవ్యాప్తంగా ఊహించిన సమయం కంటే ముందే కేసులు అదుపులోకి వచ్చాయని పేర్కొంది. జనవరి 24న దేశంలో పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉందని.. ఇప్పుడు 4.44 శాతానికి చేరిందని తెలిపింది. భారత్​లో కరోనా స్థితిపై గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాలను వెల్లడించింది. మహమ్మారి తగ్గుముఖం పడుతున్నా వైరస్​పై పూర్తి అవగాహన లేనందున అప్రమత్తంగా ఉండి పర్యవేక్షణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

ఆ రాష్ట్రాల్లో తప్ప..

కొవిడ్​ వ్యాప్తి కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇంకా ఆందోళనకరంగానే ఉందని కేంద్రం వెల్లడించింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో 50వేలకు పైగా యాక్టివ్​ కేసులు ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 40కు పైగా జిల్లాల్లో ఇంకా వీక్లీ కేసుల్లో పెరుగుదల కొనసాగుతోందని పేర్కొంది. ప్రస్తుతం 141 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా ఉందని.. 5-10 శాతం పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల సంఖ్య 160గా ఉందని వెల్లడించింది.

కేరళలో 29.57 శాతం పాజిటివిటీ రేటు ఉందని.. ప్రస్తుతం దేశంలో ఇదే అత్యధికమని కేంద్రం తెలిపింది. మిజోరం, హిమాచల్​ ప్రదేశ్​, అరుణాచల్​ ప్రదేశ్​, సిక్కిం రాష్ట్రాల్లో కూడా పాజిటివిటీ రేటు ఆందోళకరంగానే ఉందని చెప్పుకొచ్చింది.

విస్తృతంగా వ్యాక్సినేషన్​..

దేశంలో టీకాల పంపిణీ జరుగుతున్న విధానంపై కేంద్రం హర్షం వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్​ ముమ్మరంగా సాగుతోందని.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 96 శాతం మంది పెద్దలు తొలిడోసు అందుకున్నారని వెల్లడించింది. మరోవైపు 15-18 ఏళ్ల వారిలో 69 శాతం మంది తొలిడోసు తీసుకున్నారని.. 14 శాతం మందికి రెండు డోసులూ పంపిణీ చేసినట్లు వివరించింది.

ఇదీ చదవండి

వ్యాక్సిన్​ సర్టిఫికెట్​ ఉందా? అయితే నో టెస్టింగ్, నో క్వారంటైన్!

Last Updated : Feb 10, 2022, 5:56 PM IST

ABOUT THE AUTHOR

...view details