రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 30,620 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 68 మందికి పాటిజివ్‌గా తేలింది. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,88,760కు చేరింది. వైరస్ బారినపడి ఇవాళ ఒకరు మరణించిగా.. ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 7,162కి చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 814 మంది ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 106 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,80,784కి పెరిగింది.
కొత్తగా 68 కరోనా కేసులు నమోదు... ఒకరు మృతి - new 68 corona cases registered in ap
రాష్ట్రంలో కొత్తగా 68 మందికి కరోనా వైరస్ సోకగా.. ఒకరు మృతి చెందినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,88,760కు చేరింది.
రాష్ట్రంలో కొత్తగా 68 కరోనా కేసులు
విశాఖపట్నం జిల్లాలో 15, చిత్తూరులో 11, గుంటూరులో 9, కృష్ణాలో 7, నెల్లూరు 7, అనంతపురంలో 6, తూర్పుగోదావరిలో 4, పశ్చిమగోదావరిలో 4, కర్నూలులో 2, ప్రకాశం, కడప, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో కేసులు నమోదు కాలేదని ప్రభుత్వం ప్రకటించింది.
ఇదీచూడండి:దేశంలో మరో 9,309 మందికి కరోనా