ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SC Commission: గవర్నర్, సీఎంలతో ఎస్సీ కమిషన్ మర్యాదపూర్వక భేటీ

గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్​, సీఎం జగన్​తో ఎస్సీ కమిషన్ సభ్యుల బృందం వేర్వేరుగా భేటీ అయింది. రాష్ట్ర పర్యటనలో ఉన్న ఎస్సీ కమిషన్ బృందం వారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

గవర్నర్, సీఎంలతో ఎస్సీ కమిషన్ మర్యాదపూర్వక భేటీ
గవర్నర్, సీఎంలతో ఎస్సీ కమిషన్ మర్యాదపూర్వక భేటీ

By

Published : Aug 24, 2021, 7:44 PM IST

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్​ను జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుల బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్​ను కలిసిన వారిలో కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్, కమిషన్ సభ్యులు డాక్డర్ అంజూబాల, సుభాష్ రామ్​నాథ్ ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ బృందాన్ని మఖ్యమంత్రి జగన్ సన్మనానించారు.

అనంతరం రాజ్​భవన్​కు చేరుకున్న జాతీయ ఎస్సీ కమిషన్‌ బృందం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. కమిషన్ బృందానికి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా స్వాగతం పలికారు. సమకాలీన అంశాలపై గవర్నర్​తో కమిషన్ సభ్యులు చర్చించారు. ఈ భేటీలో గిరిజన, సాంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతీలాల్ దండే తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details