రాష్ట్రంలోని చేనేత వస్త్రాలకు బ్రాండ్ కల్పించి మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తామని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి వాణిజ్య పోర్టల్స్ ద్వారా విక్రయాలు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో ఆప్కో ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న మంత్రి మార్కెటింగ్‌ను పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టనుందని వెల్లడించారు. ఖాదీ, చేనేత వస్త్రాలను నవతరానికి చేరువగా తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
Handloom Day: 'చేనేత వస్త్రాలకు బ్రాండ్ కల్పించి మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తాం'
చేనేత వస్త్రాలకు బ్రాండ్ కల్పించి మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తామని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. విజయవాడలో ఆప్కో ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
మాట్లాడుతున్న మంత్రి
చేనేతను మన సంస్కృతి సంప్రదాయంగా మారుస్తామని పేర్కొన్నారు. నైపుణ్యమున్న చేనేత కార్మికుల ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. మరోవైపు ప్రభుత్వ సలహాదారు సజ్జల, జౌళిశాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్‌తో కలిసి చేనేత వస్త్రాల డిజైన్లను ముద్రించిన పోస్టల్ కవర్‌ను విడుదల చేశారు.
ఇదీ చదవండి:
murder case: హత్య.. మృతదేహం దహనం.. కేసును ఛేదించిన పోలీసులు
Last Updated : Aug 7, 2021, 5:35 PM IST