ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్రం తరహాలో పెట్రోల్, డీజిల్​పై పన్నుల బాదుడు తగ్గించేదెప్పుడో..: లోకేశ్​

'దేశంలో ఎక్కడాలేని విధంగా పెట్రోల్‌, డీజిల్‌పై వివిధ రూపాల్లో పన్నులు వసూలు చేస్తున్న వ‌సూల్ రెడ్డి(nara lokesh comments on cm jagan over petrol taxes).. కేంద్ర ప్రభుత్వం తరహాలో పన్నుల బాదుడు తగ్గించేదేమైనా ఉందా' అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు.

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
nara lokesh on petrol taxes

By

Published : Nov 4, 2021, 10:13 AM IST

కేంద్ర ప్రభుత్వం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్​పై పన్నుల బాదుడు తగ్గించేదేమైనా ఉందా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు(nara lokesh on petrol taxes). రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌తో ఇబ్బందిప‌డుతున్న సామాన్య జ‌నానికి ఉప‌శ‌మ‌నం క‌లిగించేలా లీటర్ పెట్రోల్‍పై రూ. 5, డీజిల్‍పై రూ. 10 కేంద్ర ప్రభుత్వం త‌గ్గించ‌డం సంతోషకరమైన విష‌యమని లోకేశ్​ అన్నారు.

'రాష్ట్రంలో వ‌సూల్ రెడ్డి.. పెట్రోల్‌, డీజిల్‌పై దేశంలో ఎక్కడాలేని విధంగా 31 శాతం వ్యాట్‌కి అదనంగా వివిధ రకాల సుంకం వేసి లీటర్ పెట్రోల్​పై పన్నుల రూపంలో రూ.30 బాదుతున్నారు' అని లోకేశ్​ ధ్వజమెత్తారు. కేంద్రం త‌గ్గించిన మేర‌కు రాష్ట్ర ప్రభుత్వం సుంకాలను పెంచి మ‌ళ్లీ జ‌నంపై బాదుతారేమోనని ఎద్దేవా(nara lokesh comments on cm jagan) చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్​పై పన్నుల బాదుడు తగ్గించేదేమైనా ఉందా

ABOUT THE AUTHOR

...view details