రాష్ట్ర ప్రభుత్వ తీరుపై.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కిరణ్ సర్కార్ మీటర్లు బిగించి ఉచిత విద్యుత్ పథకానికి చరమగీతం పాడితే.. మీటర్లు రైతుల పాలిట యమపాశాలు కాబోతున్నాయి అంటూ జగన్ మీడియా విమర్శించిన సందర్భాన్ని గుర్తు చేశారు. అలాంటిది. ఇప్పుడు నగదు బదిలీ పేరుతో భారాన్ని రైతుపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని దుయ్యబట్టారు.
'తండ్రి ఆశయాలకు జగన్ తూట్లు పొడుస్తున్నారు' - ఉచిత విద్యుత్ పథకం న్యూస్
వైకాపా ప్రభుత్వం నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. తండ్రి ఆశయాలకు కొడుకు జగన్ తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు.
nara lokesh on jagan govt