nara lokesh comments on ysrcp: ప్రభుత్వ ఉద్యోగులను మనుషుల్లా కూడా చూడకుండా.. ప్రభుత్వ పెద్దలు అవమానిస్తున్న తీరు బాధాకరమని(lokesh fire on ysrcp leaders behaviour over govt employees) తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. వారికి వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదని పేర్కొన్నారు. ఉద్యోగులు దాచుకున్న రూ. 1600 కోట్లను ప్రభుత్వం ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. వెంటనే పీఆర్సీ నివేదిక బహిర్గతం చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు... తాత్సారం చేయకుండా సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు.
nara lokesh comments on ysrcp: ప్రభుత్వ ఉద్యోగులను అవమానిస్తున్న తీరు బాధాకరం: లోకేశ్ - nara lokesh protest against students arrest at Anantapur
రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులను(lokesh fire on ysrcp behaviour over govt employees) అవమానిస్తున్న తీరు బాధాకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఉద్యోగులకు మనుషుల్లా కూడా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో ప్రజా, విద్యార్థి సంఘాల నేతల అరెస్టులను లోకేశ్ తీవ్రంగా ఖండించారు.
సమస్యలు విన్నవించడమే నేరమా..
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌తో.. అనంతపురం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ కాన్వాయ్‌ని అడ్డుకున్న విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేయడాన్ని(Lokesh condemned the arrest of student union leaders at Anantapur) లోకేశ్ ఖండించారు. మంత్రికి సమస్యలు విన్నవించడమే భయంకరమైన నేరమన్నట్టు అరెస్టులు చేశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా.. ప్రశ్నించే ప్రజా, విద్యార్థి సంఘాలని అరెస్టు చేయడమేమిటని నిలదీశారు. రాజ్యాంగం ఇచ్చిన నిరసన తెలిపే హక్కుని హత్యచేస్తోన్న జగన్ రెడ్డి కంటే ఉత్తరకొరియా కిమ్ నయమని లోకేశ్ ధ్వజమెత్తారు.