Nagarjuna sagar boating: కృష్ణమ్మ చిరు అలలపై తేలుతూ.. ఒడ్డున ఉండే పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ.. జీవితంలో ఓ మధురానుభూతిగా నిలిచిపోయే.. సాగర్ శ్రీశైలం లాంచీ ప్రయాణానికి సమయం ఆసన్నమైంది. సోమవారం నుంచే నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు.
అయితే.. గత రెండు నెలల క్రితమే ప్రారంభం కావాల్సిన ఈ యాత్ర.. పర్యాటకులు ఆసక్తి చూపకపోవడం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం బుకింగ్లు రావడంతో అధికారులు యాత్రకు ముహూర్తం ఖరారు చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు నాగార్జున సాగర్ నుంచి లాంచీ బయలుదేరనుంది.
టికెట్ ఛార్జీలు ఇలా ఉన్నాయి
- సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణానికి పెద్దలకు రూ.1500 చార్జీ ఉంటుంది. (ఒక వైపునకు)
- పిల్లలకు (4 ఏళ్ల నుంచి 12 సంవత్సరాలు) రూ. 1200
- రాను పోనూ కలిపి పెద్దలకు రూ. 2500, పిల్లలకు రూ. 2000