ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రఘురామపై సీఐడీ చర్యలను ఖండించిన మహిళా ఎంపీలు - mp raghurama news

సీఐడీ అధికారులు తనను కస్టడీలో హింసించారంటూ వైకాపా ఎంపీ రఘురామ రాసిన లేఖకు పలువురు మహిళా ఎంపీలు ట్విట్టర్ వేధికగా స్పందించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు అభిప్రాయపడ్డారు.

mps reacted to ysrcp mp raghurama letter
రఘురామపై సీఐడీ చర్యలను ఖండించిన మహిళా ఎంపీలు

By

Published : Jun 5, 2021, 7:29 AM IST

Updated : Jun 5, 2021, 7:43 AM IST

రఘురామపై సీఐడీ చర్యలను ఖండించిన మహిళా ఎంపీలు...

ఏపీ సీఐడీ కస్టడీలో పోలీసులు హింసించారంటూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు రాసిన లేఖపై.. పలువురు ఎంపీలు ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన మహిళా ఎంపీలు స్పందించారు. ఎంపీ రఘురామకృష్ణరాజుపై కస్టడీలో థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడంపై తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, నమ్మలేకపోతున్నానని.. మాండ్య ఎంపీ సుమలత తెలిపారు.

దీనిపై తక్షణమే తగిన చర్యలు తీసుకోకపోతే.. ఇది ఏపీ ప్రభుత్వం, పోలీసులపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజును హింసించిన విషయం చదివి దిగ్భ్రాంతికి గురయ్యానని.. శివసేన లోక్‌సభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది అన్నారు. తమ ట్వీట్‌లకు రఘురామకృష్ణరాజు రాసిన లేఖను వారు జత చేశారు.

Last Updated : Jun 5, 2021, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details