పదవీ కాంక్షతో.. ఎమ్మెల్యే జోగి రమేశ్ రగిలిపోతున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. చంద్రబాబు ఇంటిపై శాంతియుత దాడికి ఉపక్రమించారని మండిపడ్డారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత ఇంటిపై దాడికి వెళ్లారని అన్నారు. శాంతియుత నిరసనకు వెళ్తే.. అన్ని కార్లలో ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించారని రఘురామ పేర్కొన్నారు.
RRR: ఎమ్మెల్యే జోగి రమేశ్ పదవీ కాంక్షతో రగిలిపోతున్నారు: రఘురామ - ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా వార్తలు
తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపై శుక్రవారం జరిగిన దాడిపై.. ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఎమ్మెల్యే జోగి రమేశ్.. పదవీ కాంక్షతో రగిలిపోతున్నారని విమర్శలు చేశారు. శాంతియుత నిరసనకు వెళ్తే.. అన్ని కార్లలో ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే జోగి రమేశ్ పదవీ కాంక్షతో రగిలిపోతున్నారు: రఘురామ