ఏపీ ఆర్థిక స్థితిపై కాగ్ లెక్కలను పరిగణనలోకి తీసుకుని.. ఎస్‌ఎఫ్‌ఐవో లేదా సీబీఐ ఆర్థిక నేర విభాగంతో విచారణ చేపట్టాలని ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి వేల కోట్లు సేకరించడంపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. విచారణ వేళ సీఎంను ప్రశ్నించాలనే నిబంధన విధించాలని రఘురామకృష్ణరాజు లేఖలో కోరారు. అప్పులు తీసుకునేటపుడు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఎంపీ.. కార్పొరేషన్ల ద్వారా ఎలా సేకరించారో విచారణ జరిపించాలని కోరారు.
'ఏపీ ఆర్థిక పరిస్థితిపై విచారణ జరిపించండి'.. ప్రధానికి ఎంపీ రఘురామ లేఖ
ఏపీ ఆర్థిక స్థితిపై విచారణ జరిపించాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధాని మోదీకి లేఖ రాశారు. కాగ్ నివేదిక ఆధారంగా సంబంధిత ఏజెన్సీల ద్వారా విచారణ చేపట్టాలని కోరారు. విచారణ వేళ సీఎంను ప్రశ్నించాలనే నిబంధన విధించాలని రఘురామకృష్ణరాజు లేఖలో కోరారు.
ప్రధానికి ఎంపీ రఘురామ లేఖ