బెయిల్ బ్యాచ్ అంతా కలిసి నీతులు వల్లిస్తున్నట్లు ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. గృహహింస చట్టం కింద నిందితుడిగా తేలిన సీఐడీ డీజీ సునీల్‌కుమార్...మరో ఇద్దరు నిందితులతో కలిసి తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ బాగోతంపై సరైన సమయంలో సమగ్ర వివరాలతో 420 చట్టం కింద ఫిర్యాదు చేస్తానన్న రఘురామ...సీబీఐ విచారణలో అన్నీ బయటకొస్తాయన్నారు.
తనపై వారు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని రఘురామ అన్నారు. సునీల్ కుమార్‌పై ఆయన భార్య గృహహింస కేసు వేసిందని చెప్పారు. అతనిపై గృహహింస కేసులో ఛార్జ్‌షీట్ నమోదైందని వెల్లడించారు.