వైకాపా ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడకుండా చేతులెత్తేశారని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. దిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసుల కోసం ప్రత్యేక హోదాను వైకాపా ఎంపీలు తాకట్టు పెట్టారని విమర్శించారు.
భాజపాతో వైకాపా లోపాయకారి ఒప్పందం చేసుకుందని, ఆ ఒప్పందం ప్రకారమే పీఏసీ సభ్యుడిగా విజయసాయిరెడ్డిని నియమించారని పేర్కొన్నారు. నదీ జలాల విషయంలో జగన్ కేంద్రానికి లొంగిపోయారని ఆరోపించారు.