స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని.. తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. తెలుగుదేశం 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని లోక్సభలో ఆయన ప్రస్తావించారు.
'ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి' నాటుసారా ఘటనపై విచారణ జరిపించాలి:జంగారెడ్డిగూడెంలో కల్తీసారా ఘటనపై..కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. 27 మందికిపైగా చనిపోతే.. సహజమరణాలుగా చిత్రీకరిస్తున్నారంటూ రాజ్యసభలో వివరించారు. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామన్న హామీతో సంతోషించేలోపే ప్రభుత్వమే విక్రయిస్తోందన్నారు.
"ఇటీవల కల్తీసారా వల్ల మరణాలు పెరుగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో.. ఇటీవల 27 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వాటిని సహజమరణాలుగా చిత్రీకరించారు. జాతీయ నేర గణాంక సంస్థ ప్రకారం.. 2020లో కల్తీసారా వల్ల 947 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 18 మరణాలు ఏపీలోనే నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే 27 మంది మరణించారు. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామన్న మా ముఖ్యమంత్రి హామీతో ఎంతో గర్వించాం. దురదృష్టవశాత్తూ ప్రభుత్వమే మద్యం విక్రయిస్తోంది. కల్తీమద్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం సహా.. జంగారెడ్డిగూడెం ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి." -కనకమేడల రవీంద్ర కుమార్, రాజ్యసభ సభ్యుడు
ఇదీ చదవండి: CBN and lokesh on formation day: 'తెదేపా ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకుని నిలదొక్కుకుంటుంది'