ఎల్ బ్రూస్ శిఖరం అధిరోహించాడు... గన్నవరం చేరుకున్నాడు - elbrus mountain
యూరప్ ఖండంలోనే అతి ఎత్తయిన శిఖరం ఎల్ బ్రూస్ అధిరోహించాడు మన తెలుగువాడు. సాహస యాత్ర అనంతరం స్వదేశానికి తిరిగివచ్చాడు. ఆయన స్వస్థలం విజయవాడ.
యూరప్ ఖండంలోనే అతి ఎత్తయిన శిఖరం ఎక్కాడమంటే మాటలా! అది అధిరోహించేశాడు విజయవాడకు చెందిన కె.వి సూర్య ప్రకాశ్. ఆయన ఖాతాలో ఇంకా అనేక సాహస యాత్రలున్నాయి. కిందటి ఏడాదే ఎవరెస్ట్ శిఖరం... అంతకుముందు సంవత్సరం ఆఫ్రికాలోని అతి ఎత్తయిన కిలిమంజారో పర్వతం అధిరోహించాడు. ఎల్ బ్రూస్ అధిరోహణ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన సూర్య ప్రకాశ్‌కు గన్నవరం విమానాశ్రయంలో క్రీడాభిమానులు, పర్వాతారోహకులు ఘనస్వాగతం పలికారు. ఇంతకీ సూర్యప్రకాశ్ ఎవరి శిష్యుడో తెలుసా! ప్రముఖ పర్వతారోహకుడు మస్తాన్ బాబ శిష్యుడు.