ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రజా సంక్షేమంపై సమీక్షలు చేస్తే తప్పేంటి?' - jagan

ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ కాలం 2019 జూన్ 6వ తేదీ వరకు ఉంది. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఇది కాదనడానికి ఈసీ ఎవరు?: రాజేంద్ర ప్రసాద్

ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

By

Published : Apr 19, 2019, 6:02 PM IST

రాజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశం

జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్న ఓ క్రిమినల్ కేసులో... ఏ 11 ముద్ధాయి అయిన ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఏ రకంగా రాష్ట్ర సీఎస్​గా నియమిస్తారని తెదేపా ఎమ్మెల్సీ, వైవీబీ రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. అధికారులతో సమీక్షలు నిర్వహించడంపై ముఖ్యమంత్రికి ఈసీ నోటీసులు జారీ చేయడంపై ఆయన మండిపడ్డారు. ప్రజా సమస్యలపై సీఎం సమీక్ష జరిపితే తప్పు ఏంటని విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఆపద్ధర్మ సీఎం కాదు.... పూర్తి స్థాయి సీఎం అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ కాలం 2019 జూన్ 6వ తేదీ వరకు ఉందని... పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా ప్రజా సంక్షేమం చూడకూడదు అని చెప్పడానికి ఈసీ ఎవరని రాజేంద్రప్రసాద్‌ ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details