ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్ర ఆస్తులను కేసీఆర్​కు జగన్​ తాకట్టు పెట్టారు'

న్యాయమూర్తులు, కోర్టులు అడ్డురాకుంటే తమ ఇష్టానుసారం ప్రవర్తించవచ్చని పాలకులు భావిస్తున్నారని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో రోజుకి 3 మానభంగాలు, నెలకు 95 ఆకృత్యాలు జరుగుతున్నాయన్నారు.

'రాష్ట్ర ఆస్తులను కేసీఆర్​కు జగన్​ తాకట్టు పెట్టారు'
'రాష్ట్ర ఆస్తులను కేసీఆర్​కు జగన్​ తాకట్టు పెట్టారు'

By

Published : Sep 2, 2020, 3:14 PM IST

లక్షా 30 వేల కోట్ల ఆస్తులు తెలంగాణ నుంచి మనకు రావాల్సి ఉన్నా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ఆస్తులను కేసీఆర్​కు తాకట్టు పెట్టారని ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్​లో ఆమోదించే ప్రతి బిల్లుని గుడ్డిగా వైకాపా ఎంపీలు సమర్థిస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఇప్పటికైనా మేల్కొని పాలకులను ప్రశ్నించకపోతే, భవిష్యత్​లో మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ దురాగతాలు, రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలపై ప్రశ్నిస్తున్నారనే పాలకులు తెదేపాపై కక్ష కట్టారన్నారు. అసెంబ్లీలో మేధావులున్నారని భావిస్తున్న ప్రభుత్వం, అందులోని సభ్యులకన్నా ఎక్కువగా ఎందుకు సలహాదారులను నియమించుకుందని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details