అసెంబ్లీ నుంచి ఎయిర్ పోర్టు వరకూ చంద్రబాబును అడుగడునా అవమానపర్చేందుకే... అధికార పక్షం కుట్రలు పన్నుతోందని తెదేపా అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న ఆరోపించారు. వైకాపా నేతలు అసెంబ్లీలో స్పీకర్‌కు ధన్యవాదాలు చెప్పింది తక్కువ.. చంద్రబాబును విమర్శించిందే ఎక్కువ అని అన్నారు. అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో తెదేపా నేతలు, కార్యకర్తలపై హత్యలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కౌరవసభలో ధర్మరాజును అవమానించినట్లు చంద్రబాబును అవమానిస్తే... ప్రజల కంటతడికి కొట్టుకుపోతారని హెచ్చరించారు. తెదేపా అధినేతపై కక్ష సాధింపు చర్యలు మానుకుని ప్రజలకు పనికొచ్చే విషయాలపై దృష్టి పెడితే మంచిదని బుద్ధా వెంకన్న సూచించారు.
చంద్రబాబును అవమానిస్తే కొట్టుకుపోతారు: బుద్దా వెంకన్న
తెదేపా అధినేత చంద్రబాబును అడుగడునా అవమానించేదుకే వైకాపా నేతలు కంకణం కట్టుకున్నారని బుద్దా వెంకన్న అన్నారు. కక్ష సాధింపు చర్యలపై కాకుండా పాలనపై వైకాపా ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు.
చంద్రబాబును అవమానిస్తే మట్టి కొట్టుకు పోతారు:బుద్దా వెంకన్న
Last Updated : Jun 15, 2019, 3:38 PM IST