మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, కన్నబాబు వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని తెదేపా అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన వెంకన్న... సభ్యులు కూర్చున్న అసెంబ్లీ, మంత్రుల ఛాంబర్లు... చంద్రబాబు ముందు చూపునకు నిదర్శనమని పేర్కొన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు... మిత్రులు ఉండర్న బుద్ధా... కేసీఆర్, జగన్ మైత్రి అందుకు ఉదాహరణ అని అభివర్ణించారు. గతంలో శత్రువుల్లా ఉన్నవారు నేడు మిత్రులుగా ఉన్నారని గుర్తుచేశారు. నూతన ప్రభుత్వానికి సమయం ఇవ్వాలన్న ఆలోచనతో తాము తిరిగి విమర్శలు చేయడంలేదని స్పష్టం చేశారు.
వ్యక్తిగత విమర్శలు చేయడం తగదు: బుద్ధా - ycp
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైకాపా మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని పేర్కొన్నారు.
బుద్ధా వెంకన్న