ETV Bharat / city
''హైదరాబాద్ బ్రాండ్ పోయింది''
కేసీఆర్, కేటీఆర్ వైకాపాకి మద్దతు ఇచ్చుకోవచ్చు కానీ... తమ పార్టీ సమాచారాన్ని ఎలా చోరీ చేస్తారంటూ ఎమ్మెల్సీ అశోక్ బాబు నిలదీశారు. ఐటీ గ్రిడ్ సంస్థపై వారు దాడులు చేయించారని.. ఈ పరిణామంతో హైదరాబాద్ బ్రాండ్ పోయిందన్నారు.
అశోక్‌బాబు, ఎమ్మెల్సీ
By
Published : Mar 4, 2019, 5:58 PM IST
| Updated : Mar 4, 2019, 9:35 PM IST
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ అశోక్ బాబు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు దమ్ముంటే ఏపీకి వచ్చి వైకాపాకి మద్దతుగా ప్రచారం చేయాలని ఎమ్మెల్సీ అశోక్‌బాబు సవాల్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ వైకాపాకి మద్దతు ఇచ్చుకోవచ్చు కానీ... తమ పార్టీ సమాచారాన్ని ఎలా చోరీ చేస్తారంటూ నిలదీశారు. ఐటీ గ్రిడ్ సంస్థపై తెలంగాణ పోలీసుల దాడుల వల్ల హైదరాబాద్ బ్రాండ్ పోయిందన్నారు. హైదరాబాద్ లో ఉన్న సంస్థలనుతాము కూడా విజయవాడ, విశాఖ తరలిస్తామని తెలిపారు. డేటా చోరీ వ్యవహారంపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.
Last Updated : Mar 4, 2019, 9:35 PM IST